Wednesday, April 2, 2025

ముంబై స్టేషన్‌లో పనుల కారణంగా… హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లు దాదర్ నుంచి మళ్లీంపు

ముంబై స్టేషన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు, 10, 11 ఫ్లాట్ ఫాం యార్డుల విస్తరణ పనుల దృష్టా హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లను దాదర్ నుంచి మళ్లీంచనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు హైదరాబాద్- టు సిఎస్‌టీ ముంబై రైలు(12702), మే 30, జూన్ 1న లింగంపల్లి- టు సిఎస్‌టీ ముంబై రైలు(17058), జూన్ 1వ తేదీన బీదర్- టు సిఎస్‌టీ ముంబై రైలు(22144), మే 31వ తేదీ, జూన్1వ తేదీన హైదరాబాద్ టు సిఎస్‌టీ ముంబై రైలు (22731), జూన్ 1, 2 తేదీల్లో సిఎస్‌టీ ముంబై టు -హైదరాబాద్ రైలు(22732) దాదర్ వరకు నడుస్తాయని అధికారులు వివరించారు.

జూన్ 1వ తేదీన సిఎస్‌టీ ముంబై- టు ఆదిలాబాద్ రైలు(11401), సిఎస్‌టీ ముంబై- టు బీదర్ రైలు (22143)-సిఎస్‌టీ ముంబై- టు లింగంపల్లి రైలు (17057) దాదర్ నుంచి బయలు దేరుతుందని రైల్వేఅధికారులు పేర్కొన్నారు. గుంటూరు- టు కాచిగూడ రైలు(17251)ను మే 18వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్టు అధికారులు తెలిపారు. కాచిగూడ టు -గుంటూరురైలు(17252), కాచిగూడ టు -మెదక్ రైలు(07577), మెదక్- టు కాచిగూడ రైలు(07578)ను మే19వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com