- ఓటింగ్‌లో పాల్గొనే వారికి వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలి
- చీఫ్ ఎలక్షన్ అధికారికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్‌లో పాల్గొనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారికి పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మంగళవారం బిఆర్‌కె భవన్‌లో చీఫ్ ఎలక్షన్ అధికారిని కలిసి వినతిపత్రాన్ని అందించారు.
ఈ నెల 27 వ తేదీ నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ఆ రోజు వారికి సెలవు ప్రకటిస్తే పోలింగ్ శాతం ఎక్కువగా పెరుగుతుందని, ఒక జిల్లా వారు ఇంకో జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్నందున వారంతా పోలింగ్‌లో పాల్గొంటారని అందులో భాగంగా వారికి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.