-
పదేళ్ల బిజెపి పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదు
-
దేశంలో ఎలాంటి మార్పు జరగలేదు
-
కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
పదేళ్ల బిజెపి పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో దేశంలో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందన్నారు. బిజెపి ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డు పెంచలేదని, వృద్ధులకు, వితంతవులకు ఒక్క పైసా కూడా పెన్షన్ పెంచలేదని బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. నల్లధనాన్ని బిజెపి వారే దోచుకున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు.
కానీ, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. బిజెపికి ఇంకా మేనిఫెస్టోనే లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టోని విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పొందు పరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ తీసుకెళ్లిపోతే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడడం లేదన్నారు. ఎయిమ్స్ లో 750 పడకలు ఉండాలి, కానీ 135 మాత్రమే ఉన్నాయని, బిజెపి తెలంగాణకు ఏమీ చేసిందని ప్రజలు ఓట్లు వేయాలన్నారు.