Monday, May 12, 2025

Duvvada Affair:దువ్వాడ కథా చిత్రం

ఎవరీ మాధురీ… దువ్వాడకు ఎలా పరిచయం!

ఇంటి పోరు రచ్చకెక్కితే ఎలా ఉంటుందో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ కథా చిత్రాన్ని చూస్తే సరిగ్గా సరిపోతుంది. గురువారం మొదలైన ఎపిసోడ్ ఓ టీవీ సీరియల్ లాగా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. భార్య, భర్త మధ్యలో ఓ మహిళ ఎంట్రీతో సంసార చదరంగం కాస్త రాజకీయ రణరంగంగా మారింది. భర్త, నాన్న కావాలని వాళ్లు అంటుంటే, కష్టాల్లో ఉన్న నాకు దువ్వాడ అండగా ఉంటానని మాట ఇచ్చారని మాధురీ అంటుంది. ఇంతకీ ఎవరీ మాధురీ.. ఎంటీ ఈ ప్యామిలీ కథ… మాములుగానే వివాహేతర సంబంధాలు రచ్చరచ్చ అవుతుంటాయి. సామన్య జనంలోనే ఇలాంటివి పెద్ద సెన్సేషన్ గా మారుతుంటాయి. అలాంటిది ఓ రాజకీయ నాయకుడు, అందులోనూ ఎమ్మెల్సీ ఇంటి వెనుక కహానీలు ఇంకేంత సెన్సేషన్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా దువ్వాడ ఎపిసోడే అందుకు పెద్ద ఎగ్జాంపుల్.

దువ్వాడ శ్రీనివాస్ …పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీకాకుళంలో పేరుమోసిన లీడరే. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. పెద్దల సభలో ఉన్న ఈయన చేసిన చిలిపి పనులే ఇప్పుడు పెద్ద రచ్చగా మారాయి. దువ్వాడకు వాణి అనే మహిళతో మూడు దశబ్థాల కిందట పెళ్లి కాగా.. వీరికి హైంధవి, నవీణ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అంతాబాగానే ఉందనుకున్న టైమ్ లో వీరి మధ్యలో భూకంపంలా వచ్చింది మాధురీ. అసలు పేరు దివ్వల మాధురి. దువ్వాడకు వాణిలకు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే గొడవలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ లో మాధురీ ఎంట్రీ ఇంటిరచ్చను బయటకు ఈడ్చింది.

దివ్వల మాధురికి పెళ్లైంది. భర్త, పిల్లలు కూడా ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేయడం ఈమెకు అలవాటు. లేటెస్టుగా వచ్చిన పాటలకు స్టెప్పులు వేయడం ఈమెకు ఇష్టం. ఇలా ఓసారి దువ్వాడ ఇంట్లో జరిగిన ఓ పంక్షన్ లో మాధురీ డాన్స్ చేశారట. అక్కడే వీరిద్దరికి పరిచయం అయి ఉండవచ్చునని వాణి చెబుతున్నారు. కట్ చేస్తే 2022లో వైసీపీలో చేరారు మాధురీ. దువ్వాడ సమక్షంలోనే ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చిరాగానే ఆమెను మండల పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు దువ్వాడ. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో ఆమె ఆ పదవికీ రాజీనామా చేశారు.

రెండేళ్లుగా వీరిద్దరూ బాగా కలిసి తిరుగుతున్నారని, గుళ్లకు కూడా వెళ్తున్నారని వాణి చెబుతున్నారు. ఇటీవల టెక్కిలి మండలంలోని అక్కవరం గ్రామంలో దువ్వాడ ఓ ఇంటిని కొత్తగా నిర్మించుకుని అక్కడే మాధురీతో ఉంటున్నారని దువ్వాడ భార్య వాణి అంటుుంది. ఏ హక్కుతో తన భర్త, తండ్రితో ఉంటుందని దువ్వాడ భార్యకూతుళ్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తాము రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమే కానీ అది ఎలాంటి రిలేషన్ అనేదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. మున్మందు ఇది పెళ్లిగా మారిన మారోచ్చన్న హింటు కూడా ఇస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com