Friday, September 20, 2024

ఈ నెల 17 నుంచి ప్రధాని మోదీ బహుమతుల వేలం

భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపిలను వేలం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి కూడా ప్రధానికు సంబందించి బహుమతులు, జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. దేశ విదేశాలలో పుర్యటనలు, పలు సందర్భాల్లో వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం వేలం వేయబోతోంది. పారా ఒలింపిక్స్‌ విజేతలు ఇచ్చిన స్పోర్ట్స్‌ షూ మొదలుకొని వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి మొత్తం 600 వస్తువులు వేలం వేయనున్నట్లు కేంద్రం ప్రకటించంది.

వీటిలో 600 రూపాయల నుంచి మొదలు 8.26 లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు ఉన్నాయి. వీటన్నింటి విలువ సుమారు 1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రధాని మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంలో పాల్గొని మోదీకి సంబందించిన వస్తువులను కొనుగోలు చేయవచ్చని అధికారులు చెప్పారు. ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు అధికారిక వెబ్‌సైట్ https://pmmementos.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు పాల్గొనవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular