Monday, March 31, 2025

ఈ చెప్పులకు లైఫ్‌టైం గ్యారెంటీ

చెప్పులు.. కొంతమంది వివిధ రకాల చెప్పులు.. వేసుకునే దుస్తులను బట్టీ వాడుతుంటారు. కానీ, ఓ వ్యక్తికి వింత ఆలోచన వచ్చినట్లుంది. ఎప్పటికీ తెగిపోని, పాడవని చెప్పులను తయారు చేద్దామని అనుకున్నట్లున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు అనుకున్నట్లుగానే వింత చెప్పులను తయారు చేశాడు. అతను తయారు చేసిన చెప్పులు ఇప్పుడు ట్రెండింగ్‌ వీడియోగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. చెప్పుల తయారీ కోసం పక్కన పడేసిన టైర్ల రబ్బరును సేకరించాడు. వాటిని చెప్పుల ఆకారంలో కత్తిరించి, దానిపై కాళ్లకు గ్రిప్ ఉండేలా వివిధ రకాల డిజైన్లతో రబ్బర్లను తయారు చేసి అతికించాడు. ఇలా ఫైనల్‌గా టైరు రబ్బరుతో ఒరిజినల్ బ్రాండెండ్ చెప్పులను తయారు చేశాడన్నమాట.
వింత వింత ప్రయోగాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు చేసే విచిత్ర ప్రయోగాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎవరూ చేయని విధంగా, ఎవరూ ఆలోచించని విధంగా సరికొత్తగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన చెప్పులను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఒట్టు.. ఈ చెప్పులకు వందేళ్ల గ్యారెంటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి చెప్పులను ఎప్పుడూ చూడలేదే’’.. అంటూ కొందరు, ‘‘ఈ చెప్పులకు వందేళ్ల గ్యారెంటీ ఇవ్వొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా లైక్‌లు, 7.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com