Thursday, December 26, 2024

నవంబర్ 8 న ‘ఈసారైనా’

విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా ‘ఈసారైనా’. ఈ సినిమా కథ అందమైన గ్రామీణ నేపధ్యంలో సాగుతుంది. ఒక నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అతని ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. చిత్రం లో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

హీరో విప్లవ్ మాట్లాడుతూ, “ఈ సినిమా మీ అందరి ముందుకు రానున్నందుకు కారణం సంకీర్త్ అన్న. ఆయన ముందు నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసారు. ఈ సినిమా కి నేనే ప్రొడ్యూసర్ ని. అన్నిటినీ కష్టమైనా మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ అన్నీ చూడండి. నచ్చితే, సినిమా చూడండి” అన్నారు.

హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ, “శిరీష క్యారెక్టర్ నాతో చేయించిన విప్లవ్ కి తాంక్స్. ఈ సినిమా కి షూటింగ్ చేస్తున్న రోజులు సమ్మర్ హాలిడేస్ లాగ అనిపించింది. నా ఫస్ట్ సినిమా కి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది. ఇది సినిమా మాత్రం కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.” అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com