Monday, March 10, 2025

ఈ సెంటిమెంట్‌ వర్క్‌అవుట్‌ అవద్దా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ‘విశ్వంభ‌ర’ సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌నుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ‘గేమ్ ఛేంజ‌ర్’ కూడా రిలీజ్ కి ఉండ‌టంతో ‘విశ్వంభ‌ర’ వాయిదా వేసుకున్నారు. దీంతో ప‌నులు కూడా నెమ్మ‌దించాయి. వాయిదా ప‌డిన నాటి నుంచి ప‌నుల‌న్నీ మంద‌గించాయి. అన్ని నెమ్మ‌దిగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ రెండు పాట‌లు మిన‌హా షూట్ అంతా పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో కొన్ని రోజులుగా ‘విశ్వంభ‌ర‌’ రిలీజ్ ఎప్పుడు? ఉంటుంది అన్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. మార్చి లేదా వేస‌వి సెల‌వులు సంద‌ర్భంగా రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చిత్రాన్ని ఆగ‌స్టుకి వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. ఆగ‌స్టులో కూడా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట‌. ఆ రోజున రిలీజ్ చేస్తే మెగా అభిమానుల‌కు కూడా ఓ ట్రీట్ లా ఉంటుంద‌ని చిరంజీవి అండ్ కో ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో చిరంజీవి న‌టించిన చాలా సినిమాలు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ అయిన సంద‌ర్భాలున్నాయి. ఈ నేపధ్యంలో ‘విశ్వంభ‌ర’ విషయంలో అదే సెంటి మెంట్ ఫాలో అవ్వ‌డానికి డిసైడ్ అయిన‌ట్లు వినిపిస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com