Tuesday, December 24, 2024

ఈ వారం ఓటీటీల్లో 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్లలో ‘పుష్ప 2’ హవా నడుస్తోంది. దీంతో ఈ వారం కూడా సిల్వర్ స్క్రీన్‌పై తెలుగు సినిమాలేమీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థియేటర్లలో పుష్ప 2 సినిమా హంగామా నడుస్తోంది. కాబట్టి క్రిస్ మస్ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవచ్చు. ఇక ఈ వారం థియేటర్లలో సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ అనే డబ్బింగ్ చిత్రం మాత్రమే విడుదలవుతోంది. మరోవైపు ఓటీటీలో మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్ ల సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ వారం మొత్తమ్మీద సుమారు 30 కు పైగా సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో మలయాళ థ్రిల్లర్ బొగెన్ విల్లా ఆసక్తి రేపుతోంది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే ‘సింగం ఎగైన్’, ”డిస్పాచ్’ సినిమాలతో పాటు ‘హరికథ’ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా చూడదగినవే. మరి డిసెంబర్ రెండో వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్
ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 09
ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 09
జెమియా ఫాక్స్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 10
పోలో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
రగ్డ్ రగ్బీ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
మకల్యాస్ వాయిస్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 11
మారియా (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 11
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
ద ఆడిటర్స్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) – డిసెంబర్ 12
లా పల్మా (నార్వేజియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
నో గుడ్ డీడ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
1992 (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
క్యారీ ఆన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 13
డిజాస్టర్ హాలీడే (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 13
మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 14
అమెజాన్ ప్రైమ్ వీడియో
సీక్రెట్ లెవల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
సింగం ఎగైన్ (హిందీ సినిమా) – డిసెంబర్ 12
బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 11
ఎల్టన్ జాన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 13
హరికథ (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
ఇన్విజబుల్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
బూకీ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
పారిస్ & నికోల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
బుక్ మై షో
డ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ సినిమా) – డిసెంబరు 10
ద క్రో (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 10
సోనీ లివ్
బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ సినిమా ) – డిసెంబర్ 13

ఈ వారమే వస్తున్న తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రిలీజ్ ట్రైలర్
ఓటీటీలోకి ఈ వారం తెలుగులో ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ నటించిన ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ సోమవారం (డిసెంబర్ 9) రిలీజైంది. మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే తెలుగులో మరో వెబ్ సిరీస్ రాబోతోంది. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ సిరీస్ పేరు హరికథ. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

హరికథ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
హరికథ వెబ్ సిరీస్ మైథాలజీ జోడించిన మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ మధ్యకాలంలో సినిమాలు, వెబ్ సిరీస్ చాలా వరకు మైథాలజీ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా రాబోతున్న ఈ సిరీస్ కూడా ఎంతో ఆసక్తి రేపుతోంది. శుక్రవారం (డిసెంబర్ 13) నుంచి హరికథ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ లాంటి వాళ్లు నటించారు. కొన్నాళ్లుగా ఈ సిరీస్ ను హాట్‌స్టార్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుండగా.. తాజాగా సోమవారం (డిసెంబర్ 9) రిలీజ్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

హరికథ ట్రైలర్ ఎలా ఉందంటే?
దేవుడే వచ్చి తమ ఊళ్లో వాళ్లను చంపుతున్నాడని నమ్మే ఓ ఊరి చుట్టూ తిరిగే కథే ఈ హరికథ. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ ట్రైలర్ కూడా స్టోరీపై ఓ గ్లింప్స్ ఇచ్చింది. పవిత్రానాయ సాధూనాం అనే భగవద్గీతలోని శ్లోకం బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తుండగా.. ఈ ట్రైలర్ మొదలవుతుంది. స్క్రీన్ పై వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న ఊళ్లో ఈ వరుస హత్యలేంటన్న ఆందోళన అంతటా కనిపిస్తుంది. ఆ దేవుడే ఈ హత్యలు చేస్తున్నాడంటూ అక్కడున్న వాళ్లు నమ్ముతుంటారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ పోలీస్ ఆఫీసర్.. ఈ హత్యల వెనుక మిస్టరీని తాను ఛేదిస్తానంటూ సవాలు చేస్తాడు. ఈ క్రమంలో తన వాళ్లను కూడా కోల్పోతాడు. ఆ హత్యలు చేస్తున్నదెవరు? నిజంగా ఆ దేవుడే దిగి వచ్చి దుష్టులను శిక్షిస్తున్నాడా? ఆ హత్యలను పోలీస్ ఆఫీసర్ ఛేదించగలడా? అన్న ప్రశ్నలకు ఈ వెబ్ సిరీస్ సమాధానం చెప్పనుంది. ట్రైలర్ చివర్లో నిజంగా ఆ దేవుడే దిగి వచ్చినట్లుగా చూపించడం ఆసక్తి రేపుతోంది.
మైథాలజీని ఆధారంగా చేసుకొని వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు అందరి కళ్లూ ఈ జానర్ పై పడ్డాయి. ఈ నేపథ్యంలో హరికథ వెబ్ సిరీస్ ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సిరీస్ ను డిసెంబర్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com