- సమ్మక్క, సారాలమ్మ తల్లి అగ్రహించిందా…?
- ఈ ఉదయం 7.27 గంటలకు భూ ప్రకంపనలు
- హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కంపించిన భూమి
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలోనూ భూకంప ప్రభావం
- ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
ములుగు జిల్లా: తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7.27 గంటలకు అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రం ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రభావం మాత్రం 225 కిలోమీటర్ల మేర విస్తరించింది. మేడారం పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4న 50వేల చెట్లు ఎక్కడ పడ్డాయో….. అక్కడే మొదలయిందని అధికారులు వెల్లడించారు.