Tuesday, April 1, 2025

మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత‌!

ముందే ఊహించిన‌ట్లు మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ ఎత్తివేసింది. డిసెంబర్‌ 3న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగియక ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌తోపాటు అదనపు డీజీ సంజయ్‌ కుమార్‌, మహేశ్‌ భగవత్ లు క‌లిసిన విష‌యం తెలిసిందే. దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అంజనీ కుమార్‌ను ఎన్నిక‌ల సంఘం సస్పెండ్‌ చేయగా, మిగిలిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు నోటీసుల్ని జారీ చేసింది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని ఈసీకి మాజీ డీజీపీ తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజున అప్ప‌టి పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో ఉన్న రేవంత్‌ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని చెప్పారు. ఇలాంటి ఘటన పునరావృతం కాదని వివరణ ఇచ్చారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం పంపింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com