Friday, May 16, 2025

కేసీఆర్​పై ఈడీ కేసు…బీజేపీ ఎంపీ రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు

కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ళ పండుగ అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.  సిద్ధిపేటలో హరీష్ రావు ఉండగా…ఎస్కార్ట్‌లో ఆయన ఉన్న మీటింగ్‌కి ఇంకొకరు వస్తారని, హరీష్ రావు కూడా ఊహించలేదని, దుబ్బాకలో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరీశ్ ఎగిరాడని సెటైన్​ వేశారు. ఒక్కసారి  యుద్ధం మొదలు పెట్టాక గెలిచేవరకు ఒదిలిపెట్టొద్దని అన్నారు. పార్టీ శ్రేణులు గురువారం నిర్వహించిన సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని, రఘునందన్ అంటే మాటల మనిషి కాదు..చేతల మనిషి అని ఆయన అన్నారు. పైసలు, మందు ఓపెన్‌గా పంచినా ఓడిపోయారని ఎన్నికలను ప్రస్తావించారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచానని, రాజకీయాల్లో రాణించాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్‌తో కలిసి ముందుకు సాగాలని, జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచాం అని రఘునందన్ రావు అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com