Monday, November 18, 2024

8న విచారణకు రండి

  • క్రికెటర్ అజారొద్దీన్​ కు ఈడీ మరోసారి నోటీసులు
  • గతంలో ఉప్పల్​ పీఎస్​ లో నమోదైన ఎఫ్​ఐఆర్​ ల ఆధారంగా ఈడీ కేసు నమోదు

హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్ ​(హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరు కావాలని మూడ్రోజుల క్రితం నోటీసులు జారీ చేయగా, హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని ఆయన ఈడీని మెయిల్ ద్వారా కోరారు. ఈ మేరకు అక్టోబర్​ 8న (మంగళవారం) విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.

గతంలో ఉప్పల్ పోలీస్ ​స్టేషన్​లో నమోదైన ఎఫ్‌ఐఆర్​ల ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్ బాల్స్, జిమ్‌ పరికరాలు, ఫైర్ కిట్లు, ఇతర సామగ్రి కొనుగోలు లాంటి పలు చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది. అజారుద్దీన్​తో పాటు మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular