Saturday, April 5, 2025

ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్‌

పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి 26 వరకు ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ ఫెయిర్‌ ఉంటుందని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. భారత్ నుంచి చదువుకోడానికి రావాలనుకునే విద్యార్ధుల కోసం అమెరికా యూనివర్శిటీలు ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఉన్నత చదువుల కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని తెలియజేసేందుకు ఎడ్యుకేషన్‌యూఎస్‌ఏ పేరుతో అమెరికా ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 16 నుంచి 26వ తేదీ వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్‌‌లను నిర్వహించనున్నారు.

ఆగస్టు 16న హైదరాబాద్‌లో, 17న చెన్నైతోపాటు బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌, పుణె, ముంబయి, దిల్లీ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. డిగ్రీ, పీజీ, డాక్టరేట్‌ ప్రొగ్రామ్‌లలో అడ్మిషన్‌ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల కోసం అమెరికాకు చెందిన దాదాపు 80కిపైగా యూనివర్సిటీలు, కాలేజీల ప్రతినిధులు ఈ ఫెయిర్‌లలో ఉండనున్నారు. ఋ ఫెయిర్లను ఎంట్రన్స్ ఉచితం.అయితే రిజిస్ట్రేషన్‌ మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలని చెన్నై కాన్సులేట్ ఓ ప్రకటనలో తెలిపింది. https://bit.ly/EdUSAFair24Emb వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com