Tuesday, January 7, 2025

ఈదులకుంట చెరువు దొరికింది

ప్రభుత్వ రికార్డుల్లో కనిపించకుండా పోయిన హైదరాబాద్​లోని ఈదులకుంట చెరువు ఆచూకీ ఎట్టకేలకు హైడ్రా గుర్తించింది. కూకట్‌పల్లి, ఖానామెట్‌ గ్రామాల మధ్య ఆ కుంట గతంలో సుమారుగా 7 ఎకరాల్లో విస్తరించి ఉండేది. తుమ్మిడికుంట ఆక్రమణల్లో చిక్కుకుపోవడం, రోడ్డు విస్తరణ, పైవంతెన నిర్మాణ పనులతో వరద కాలువ మూసుకుపోవడంతో ఈదులకుంటలో చేరాల్సిన వరద, అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్‌ ఇండియా కాలనీల్లోకి మళ్లింది. దీంతో ఈదులకుంట భూమికి మంచి డిమాండ్​ ఏర్పడింది. అదే అదనుగా కొందరు ఈ కుంటపై కన్నేశారు. ఈ క్రమంలో కొందరు నీటి పారుదల శాఖ, రెవెన్యూ, బల్దియా అధికారులతో చెరువును రికార్డుల్లో లేకుండా మార్పులు చేయించారు. గతంలోనే దీనిపై వివిధ వార్తా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. ఇటీవల హైడ్రా మాదాపూర్​లోని తుమ్మిడికుంట వద్ద ఎన్‌-కన్వెన్షన్‌ను నేలమట్టం చేసిన సందర్భంగానూ ఈదులకుంట కనిపించకుండా పోయిన ఉదంతంపై కథనాలు వచ్చాయి.

త్వరలోనే పునరుద్ధరణ
వార్తా పత్రికల్లో వరుస కథనాలు, స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ రంగంలోకి దిగారు. నేషనల్​ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం పటాలు, సర్వే ఆఫ్‌ ఇండియా ట్రోపో చిత్రాలను పరిశీలించారు. వాటిలో ఈదులకుంట పరిసర ప్రాంతం ఆనవాళ్లు దొరికాయి. వాటి ఆధారంగా అధికారులు గురువారం (జనవరి 2) చెరువును సర్వే చేసి హద్దులను నిర్ధారించారు. త్వరలోనే ఈదులకుంట చెరువు పునరుద్ధరణ పనులు మొదలవుతాయని హైడ్రా అధికారులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com