Wednesday, April 2, 2025

రేవంత్ నోరు, ఒళ్ళు దగ్గరపెట్టుకో

  • రేవంత్ నోరు, ఒళ్ళు దగ్గరపెట్టుకో
  • ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు…ఖబర్దార్.
  • వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
  • వసూళ్ళ చిట్టా రికార్డ్ అవుతుంది
  • మాజీ మంత్రి ఈటల రాజేందర్

టీఎస్ news :ఈమధ్య కాలంలో నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ నెలరోజుల్లోనే రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారు.మోదీగారు మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది అని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని కేటాయించారు అని చెప్పిన సీఎం.. మళ్లీ మోదీ ఎంది అనిమాట్లడుతున్నారు.కెసిఆర్ కూడా అలానే మాట్లాడారు. ఆయనకు పట్టిన గతే మీకు పడుతుంది.నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో.అధికారం ఉందని ఎది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

కెసిఆర్ ఫోన్ టాపింగ్ చేస్తున్నారు అని విమర్శించిన వీరు కూడా ఫోన్ టాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అప్రజాస్వామికం వ్యవహరిస్తే ఖబర్థార్.

పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు వ్యవహరిస్తున్నారు..
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల ఎంత వేదిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుంది. ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావు. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు.

మల్కాజిగిరిలో ఎవరు వచ్చిన ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టిన గెలిచేది బీజేపీనే అని ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుంది అని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com