టీఎస్, న్యూస్
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తో ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్న ఫోటో వైరల్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈటలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా బిజెపిని టార్గెట్ చేస్తున్నట్లు అవగతం అవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజరాబాద్ నియోజకవర్గాల నుండి బరిలో నిలిచి ఈటల ఓడిపోయారు. అప్పటికే తెలంగాణ బిజెపిలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. బండి సంజయ్ – ఈటల వర్గీయుల మధ్య రాజకీయ వైరం ఉన్న విషయం అందరికీ విధితమే. ఈటల రాజేందర్ గత కొంతకాలంగా బిజెపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బిజెపిలోనే కొంతమంది నేతలు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని పలు ఇంటర్వ్యూలలో అసహనాన్ని వ్యక్తం చేశారు. పట్న మహేందర్రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఈటల రాజేందర్ ముగ్గురు ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుంది .