Sunday, November 17, 2024

అధికారులపై దాడి ఘటనలో విచారణ

అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌

అధికారులపై దాడి ఘటనలో విచారణ లోతుగా కొనసాగుతుందని విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలంగాణ అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌పేర్కొన్నారు. శనివారం వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌తో రెండు గంటలకు పైగా అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌సమావేశమై దాడి వివరాలను కలెక్టర్‌ ‌ద్వారా తెలుసుకున్నారు. అనంతరం వికారాబాద్‌ ‌జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణరెడ్డితో అడిషనల్‌ ‌డీజీ సమావేశమయ్యారు. అనంతరం ఆయనను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేయగా విచారణ కొనసాగుతుందని, విచారణ పూర్తి తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌వెళ్లపోయారు.

లాగచర్ల ఘటనలో మరో ఎనిమిది మంది అరెస్ట్…
‌ఫార్మా కంపెనీల ఏర్పాటులో భాగంగా భూసేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌, ‌కాడ ప్రత్యేక అధికారి వెంకట్‌ ‌రెడ్డి, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌లింగ్యా నాయక్‌, ‌తహసిల్దార్‌, అధికారులపై జరిగిన దాడిలో ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ ‌కు తరలిస్తున్నారు. శనివారం మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు పంపించారు. కొడంగల్‌ ‌దాడి ఘటనలో మొన్న 21 మందిని రిమాండ్‌ ‌చేయగా నేడు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌ ‌చేయడంతో రిమాండ్‌ ‌చేసిన వారి సంఖ్య 29కి చేరింది. ఇంకా తప్పించుకొని తిరుగుతున్న వారి కోసం పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపులు చర్యలు చేపట్టారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారి వెనకాల ఎంత పెద్దవారు ఉన్న కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

 జిల్లా కలెక్టర్‌ ‌కు భద్రత పెంపు….
వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ‌లగచర్ల దాడి ఘటనను దృష్టిలో ఉంచుకొని వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌కు భద్రత పెంచుతూ ప్రభుత్వం భద్రత సిబ్బందిని నియమించింది. శనివారం వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌  ‌జైన్‌ ‌పై దాడి నేపథ్యంలో కలెక్టర్‌ ‌కు అదనంగా ఇద్దరు ఏఆర్‌ ‌గన్‌ ‌మెన్‌ ‌లను కేటాయించిన పోలీస్‌ ‌శాఖ… అధికారులపై దాడి ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమై అధికారులు అలసత్వం వహించకుండా భద్రత సిబ్బందితో ఉండేలా యంత్రంగం చర్యలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular