సమ్మర్‌లో బీర్ల కొరత ఉండదు
తెలంగాణలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి వస్తుంది. హైదరాబాద్ నగరంలో ప్రతి 3 కి.మీ ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీ ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ ముగియగానే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
నగరంలో ప్రతి 3 కి.మీ ఒకటి, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీ ఒకటి చొప్పున ఈ ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా గ్లాసులోకి వస్తుంది. ప్రస్తుతం విదేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉండగా.. తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదే జరిగితే సమ్మర్‌లో మందుబాబులకు బీర్ల కొరత కష్టాలు తీరిపోనున్నాయి. అప్పటికప్పడు తయారయ్యే ఇన్‌స్టంట్ బీరుతో దాహం తీర్చుకోవచ్చు.
ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా70 బార్లను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,171 బార్లు ఉండగా.. వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో కొత్తగా బార్ల ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్దమైనట్లు తెలిసింది. ఎక్సైజ్ ఖజానా పెంచుకునేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సమాచారం. దాంతో పాటుగా.. మైక్రోబూవరీల సంఖ్యను కూడా పెంచే అవకాశమున్నట్లు సమాచారం. ఈ మేరకు నగరంలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌ల ఏర్పాటుకు సర్కార్ సిద్ధమైంది.
తెలంగాణలో కొత్తగా మద్యం బ్రాండ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ అమ్మేందుకు కంపెనీల నుంచి TGBCL అఫ్లికేషన్లు ఆహ్వానించింది. 40 వరకు కంపెనీలు లిక్కర్ సరఫరా చేసేందుకు ముందుకు రాగా.. అందులోనూ 20 దాకా విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నట్లు సమాచారం. 10 వరకు బీర్ల కంపెనీలు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.