Saturday, January 4, 2025

ఎలాన్‌ మస్క్‌ కాదు.. కేకియస్‌ మాక్సిమస్‌

పేరు మార్చుకున్న ప్రపంచ కుబేరుడు

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తన పేరును మార్చుకున్నారు. తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ అయిన ఎక్స్‌ లో తన పేరును మస్క్‌కు బదులుగా ‘కేకియస్‌ మాక్సిమస్‌’ గా మార్చుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. ఆ పేరుకు అర్థం ఏంటా..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే, కేకియస్‌ అనేది ఓ క్రిప్టో కరెన్సీ టోకెన్‌. పలు బ్లాక్‌ చెయిన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ఇది అందుబాటులో ఉంది.
కాగా, ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే ఓ అరుదైన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా విరాజిల్లుతున్న మస్క్‌.. ఓ అరుదైన ఘనతను సాధించారు. మస్క్‌ వ్యక్తిగత సంపద ఏకంగా 400 బిలియన్‌ డాలర్ల మార్కును దాటేసింది. ఇప్పటిదాకా ఈ మైలురాయిని ఎవరూ అధిగమించలేదు. దీంతో ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా మస్క్‌ నిలిచారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా వివరాల ప్రకారం మస్క్‌ సంపద విలువ 447 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com