-
బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై ఈసీ చర్యలు
-
48 గంటలు ప్రచారానికి దూరం
టీఎస్, న్యూస్ :తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆయనపై నిషేధం విధించినట్టు ఈసీ అధికారులు తెలిపారు. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఈసీ చర్యలు తీసుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం అమలులో ఉండనుంది.