టీఎస్, న్యూస్: లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో ఉండనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే తొలి దశ ఎన్నికలు జూన్ 7న జరిగే ఏడో దశ పోలింగ్‌తో ముగుస్తుంది. ఏఏ విడతలో ఎన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుందో కూడా ప్రకటించింది.
ఏడు దశలు…నియోజకవర్గాలు
ఈసీసీ ప్రకటించిన ప్రకారం, ఏప్రిల్ 19న తొలిదశ ఎన్నికల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుంది. రెండో విడత ఏప్రిల్ 26న 89 నియోజవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మూడో విడత మే 7న 94 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది. నాలుగో విడత మే 13న 96 నియోజకవర్గాల్లో , మే 20న ఐదవ విడత 49 నియోజకవర్గాల్లో, మే 25న ఆరో విడత 57 నియోజకవర్గాల్లో, జూన్ 1న ఏడో విడత 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
1.8 కోట్ల మందికి తొలిసారి ఓటు
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారంనాడు ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో 1.8 కోట్ల మంది తొలిసారి ఓటు వేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దివ్వాంగులు 88.4 లక్షల మంది, 85 ఏళ్లు పైబడిన వారు 82 లక్షల మంది, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 48,000 మంది, 100 ఏళ్లు పైబడిన వారు 2.18 కోట్ల మంది, యువ ఓటర్లు 19.74 కోట్ల మంది (20-29 ఏళ్ల లోపు) ఉన్నారు.
ఏపీలో..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4 న కౌంటింగ్ జరగనుంది. 2024 మార్చి 16న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రెస్ నోట్, ప్రకటన రిలీజ్ అయింది. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సైతం తేదీలు ఖరారయ్యాయి. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
కాగా.. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దీంతో మరోసారి ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారం చేపట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుండగా.. టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఫలితంగా ఈ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వాడీ వేడీగా సాగనున్నాయి.
ఏడు దశల్లో పోలింగ్:
ఏప్రిల్ 19 – తొలిదశ ఎన్నికలు
ఏప్రిల్ 26 – రెండో దశ పోలింగ్
మే 7 – మూడో దశ పోలింగ్
మే 13 – నాలుగో దశ
మే 20 – ఐదో దశ పోలింగ్
మే 25 – ఆరో దశ పోలింగ్
జూన్ 1 – ఏడో దశ పోలింగ్
కాగా.. ప్రస్తుత 17వ లోక్‌సభ గడవు జూన్ 16తో ముగియనుండగా.. ఆంధ్రప్రదేశ్ (జూన్ 11), ఒడిశా (జూన్ 24), అరుణాచల్ ప్రదేశ్ (జూన్ 2), సిక్కిం (జూన్ 2) అసెంబ్లీల గడువు కూడా జూన్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈసీ (EC) వివిధ రాష్ట్రాల్లో పర్యటించి.. స్థానిక రాజకీయ పార్టీలతో పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించి.. ఆ తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్‌ని తయారు చేసింది. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 97 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో 49.7 మంది పురుషులు, 47.1 మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండటం గర్వించదగిన విషయమని చెప్పారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయని, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు ఉంటాయని.. తాగునీరుతో పాటు టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
మరిన్ని ముఖ్యాంశాలు:
* ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం
* హింసకు పాల్పడితే నాన్-బెయిలబుల్ వారెంట్స్
* పోలింగ్ డ్యూటీలో వలంటీర్లు, కాంట్రాక్ట్ సిబ్బంది నోఎంట్రీ
* రోండోసారి ఓటు వేయడానికి వేస్తే కేసు నమోదు
* జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ ముగింపు
* బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్
* 85 ఏళ్లు దాటిన వారికి, వికలాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్
* పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్ల వాడకం
* సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం
* ఫేక్ న్యూస్‌పై ఫ్యాక్ట్ చెక్ ఫెసిలిటీ పెట్టిస్తామన్న ఈసీఈ
* దేశంలో 48 వేల మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు
* స్టార్ క్యాంపెయినర్లకు ప్రత్యేక గైడ్‌లైన్స్
* కుల, మతాన్ని రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వొద్దు.. ఓట్లు అడగొద్దని సూచన
* ఎన్నికల ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలు ఉండకూడదు
* సూర్యాస్తమయం తర్వాత బ్యాంక్‌ల క్యాష్ వ్యాన్లకు అనుమతి లేదు
* పార్టీల మిస్ లీడింగ్ యాడ్స్‌కు అనుమతి లేదు
* 2100 మంది ఎన్నికల అబ్జర్వర్లు
* 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు