2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 3వేల కోట్ల టర్నోవర్
నగరంలోని Electronics Corporation of India Limited (ECIL) ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థ మరో మైలురాలను సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3వేల కోట్ల టర్నోవర్ ను సాధించి అగ్రగామిగా నిలిచింది. మేక్ ఇండియా స్ఫూర్తితో దేశంలోని పలు పరిశోధన సంస్థలకు కావలసిన ఉత్పత్తులను ఈసీఐఎల్ రూపొందిస్తూ తన ఉనికిని చాటుకుంటుంది.
గత ఆర్థిక సంవత్సరంలో… సాధారణ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను, న్యూక్లియర్ ఫ్లవర్ ప్లాంట్లకు కావలసిన రేడియేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సెక్యూరిటీ సిస్టం , కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ రేడియస్ టూ ఆర్మూర్డ్ ఫోర్సెస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు పలు భారీ పరిశ్రమలకు తమ ఉత్పత్తులను అందజేసినట్లు తెలిపారు.
ఇందులో అధికంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఆర్మూర్డ్ పో, న్యూక్లియర్, సెంట్రల్ స్టేట్ పోలీస్, పారా మిలిటరీ ఫోర్సెస్, పలు ప్రభుత్వ సంస్థలతో తమ వ్యాపారాలను కొనసాగించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే చొరవతో ఈసీఐఎల్ సంస్థ మరింత సరికొత్త పరిజ్ఞానంతో తమ ఉత్పత్తులను అందజేస్తూ ముందుకు సాగుతుందని ఈసీఐఎల్ యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.