Saturday, December 28, 2024

క‌ళ్యాణ్‌రామ్‌తో టైమ్ స్పెండ్ చేయ‌డం న‌చ్చింది

* తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను ల‌వ్ చేస్తారు
హాలీవుడ్ నటి- ‘ఎల్నాజ్ నోరౌజీ’

ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ గా పిలవబడే “సేక్రేడ్ గేమ్స్”లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి ‘ఎల్నాజ్ నొరౌజీ’. “కాందహార్” చిత్రంతో హాలీవుడ్‌లో తెరగేంట్రం చేసి, పాపులర్ గెరార్డ్ బట్లర్‌తో స్క్రీన్‌ను పంచుకుంది. తాజాగా , నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, సెక్సీ లుక్స్ తో ప్రత్యేక పాటలో నర్తించి అందరిని కవ్వించింది. ప్రస్తుతం ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన “డెవిల్” సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ‘ఎల్నాజ్ నౌరౌజీ’ పత్రికల వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..

ఇరాన్‌లో పుట్టి, జర్మనీలో పెరిగిన మీరు.. ఇండియన్ సినిమాకి ఎలా వచ్చారు?

– నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను. సో.. బాలీవూడ్ లో యాక్ట్ చేయాలనీ నా కల. ప్రపంచంలో ఎక్కడ లేని ప్రత్యేకత భారత్ కి ఉంది. ఇక్కడ అన్ని కళలని ప్రోత్సహిస్తారు. నాకు బాగా నచ్చింది. అందుకే ఇక్కడ యాక్ట్ చేయాలనుకున్నాను.

దాదాపు మీరు భారతదేశాన్ని మీ స్వస్థలంగా మార్చుకున్నట్టున్నారు?

నిజమే. ఇప్పుడు నాకు భారతదేశం నా సొంత ఇల్లు లాంటిది. ఇప్పటికే ఇండియాలో 8 సంవత్సరాలుగా వుంటున్నాను.. ఆల్ రెడీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు గడిచాయి.

మీకు బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. తెలుగు సినిమాలో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?

‘డెవిల్’, సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఓ పాట ద్వారా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. సౌత్ లో ప్రజలు చాలా పోలైట్ గా, కుటుంబ‌ సాంప్రదాయాలకు విలువలు ఇస్తారు. ముఖ్యంగా, తెలుగు ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాలో నటించడం నాకు చాలా గర్వంగా ఉంది. అవకాశాలు వస్తే తెలుగులో అందరి హీరోలతో తప్పకుండా చేస్తాను.

డెవిల్‌లో నటించడం ఎలా అనిపించింది? ఈ చిత్రంలో ఛాన్స్ ఎలా వచ్చింది?

– ఇంతకముందు తెలుగులో ఏ సినిమా చేసిన ఎక్సపీరియన్స్ లేదు. ‘డెవిల్’ లో సాంగ్ చేయడానికి చాలా హోమ్ వర్క్ చేశాను, కొన్ని విషయాలు తెలియకపోతే తెలుసుకొని చేశాను. నాకు, ఈ సినిమాలో నా నృత్యాన్ని చూసి తీసుకున్నారు. నాకు పెద్దగా బ్యానర్స్ గురించి తెలియదు. దక్షిణాదిలో అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్లో పని చేయటం, వాళ్ళ ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా హ్యాపీగా భావిస్తున్నాను.

‘డెవిల్’ బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ఇలాంటి ఫిల్మ్ లో పాత్రలు అరుదుగా వస్తుంటాయి? మీకు ఈ సినిమా ఎంత ప్రత్యేకం?

పిరియాడికల్ ఫిల్మ్ తీయడం చాలా కష్టం. పైగా.. చాలా బడ్జెట్ తో కూడినది. క్యారెక్టర్ చేసేటప్పుడు కథని అర్ధం చేసుకోవాలి. దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ ధరించాలి. అప్పుడే, తెర మీద అద్భుతంగా వస్తుంది. ఈ సినిమాలో నా లుక్ చాలా స్పెషల్. హెయిర్, రెడ్ లిప్స్ జాజ్ టైప్ మ్యూజిక్, నేను ఇంతక ముందు అలా ఎప్పుడు కనిపించలేదు కూడా.. స్పెషల్ గా నాకు ఈ సినిమా ప్రత్యేకమనే చెప్పాలి.

డెవిల్ సినిమాలో మీరు చేసిన స్పెషల్ సాంగ్ గురించి చాలా మంది చెబుతున్నారు. ఎలా ఉండబోతోంది?

– నేను ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేశాను. నేను చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులు చూసి, నన్ను లవ్ చేస్తారని భావిస్తున్నాను.. నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్త అయినప్పటికీ నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తున్నాను.

హీరో కళ్యాణ్‌రామ్‌తో పని చేయడం ఎలా అనిపించింది?

– కళ్యాణ్ రామ్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఆయన సెట్‌లో చాలా సైలెంట్, అలాగే షై కూడా.. సెట్ లో నాకు చాలా హెల్ప్ చేసారు. ముఖ్యంగా, డైలాగ్స్ చెప్పేటప్పుడు నాకు ఎన్నో టిప్స్ చెప్పారు. ఆయనతో టైమ్ స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చింది. నాకు ఇప్పటికి ఏడు ల్యాంగ్వేజ్ లు తెలుసు. తెలుగు కూడా త్వరలోనే నేర్చుకుంటా.

టాలీవుడ్ కి.. బాలీవుడ్ కి తేడా ఏమైనా గమనించారా?

– నాకు టాలీవుడ్ చాలా కొత్త. సో, ఇప్పుడే ఆ విషయం గురించి నేను చెప్పలేను. ప్రస్తుతానికి అందరూ ప్రొఫిషనల్స్ గా వర్క్ చేస్తున్నారు.

డెవిల్ సినిమా మీ కెరీర్‌లో గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారా?

– ఈ సినిమా ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారు అనే దాని బట్టి సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నా పాత్ర, కావచ్చు.. నేను చేసిన సాంగ్ కావచ్చు. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుంది.. టీమ్ అందరు 100% ఎఫర్ట్స్ పెట్టారు. ఖచ్చితంగా నాకు ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను.

మీరు సినిమాలుతో పాటు, బుల్లితెరపై కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

– నేను సినిమాలతో పాటు, వెబ్ షోలు చేశాను, అలాగే పాడతాను కూడా, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడంలో పర్ఫెక్ట్ అని నా బలమైన నమ్మకం. అలాగే, నాకు నచ్చింది చేయడం చాలా ఇష్టం. మీకు నచ్చింది చేయాలనుకున్నప్పుడు ఎంత రష్ ఉన్న వాటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. నేను అలాంటి లైఫ్ ని ఇష్టపడతాను.

రాబోయే రెండేళ్లలో మిమ్మల్ని మీరు ఎలా చుసుకోబోతున్నారు?

– నేను ఖచ్చితంగా ఇలా ఉంటాను అని చెప్పలేను. కానీ, నాకు సింగింగ్ అంటే ఇష్టం. దాని మీద దృష్టి పెడదామని నా ఆలోచన. నేను 2022లో ప్రారంభించిన 2 పాటలు రీలిజ్ అయ్యాయి. 3వ పాట కూడా త్వరలో వస్తోంది. వీటితో పాటు తప్పకుండా మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని ఉంది.

నెక్స్ట్ మీ రాబోయే సినిమాలు ఏమిటి?

-నవాజుద్దీన్ సిద్ధిఖీతో….సంగీన్ అనే ఒక థ్రిల్లర్ రాబోతుంది. ‘రాణీతి’ అనే మూవీ జియో సినిమాలో విడుదలయ్యే సిరీస్. నేను చేస్తున్న పాట ‘వోహ్’ కూడా అదే ప్లాట్ ఫార్మ్ లో రీలిజ్ అవ్వుతుంది. అలా, పైప్‌లైన్‌లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీకు త్వరలో తెలుస్తుంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించింది.

 

Elnaaz Norouzi has evidently captivated the Telugu audience with her mesmerizing dance performances in “Devil.”

#ElnaazNorouzi, renowned for her notable roles in Bollywood productions and web series like #SacredGames, has ventured into #Hollywood with the film #Kandahar where she shares the screen with #GerardButler. Additionally, she has marked her debut in Telugu cinema with “Devil,”alongside #NandamuriKalyanRam. Released, the film not only highlights #Elnaaz’s captivating presence in a special song, where her alluring looks and dynamic dance moves impart a sizzling touch but also showcases her in a significant character within the movie. In commemoration of the film’s release, here’s a concise dialogue with the exceptionally talented actress.

Q; You were born in #Iran and brought up in #Germany. How did you end up in #Indian Cinema?

– It was my dream to work in #Bollywood, as I grew up watching all the Bollywood movies with the thought of becoming an actress. And that came from the fact that I would watch the movies constantly and wonder if this is what I want to be. A place where all the colors are, where all the music is, where all the dance is ya so that’s how I decided to come to India and pursue my dream.

Q; You see to have made India almost your home?

– India is my home for me now. It’s been 8 long years for me now in India and at the same time 5 years in the film industry.

Q; You have the experience of working in #Bollywood. How is your experience working in Telugu Cinema?

– I have done this movie titled Devil where I have a special appearance through a song. I can’t compare it but what I do love about South India is people are so polite, it is so
different I enjoyed working in the Telugu industry and I would love to do more.

Q; How is it working in #Devil? How did you land in this film?
– I was offered this song and since I have never done anything in Telugu I did my
homework and tried to find out what needs to be done. #AbhishekPictures is such a big production house in the South it was a no-brainer for me. I knew that this was what I should do.

Q; #Devil is a period film Set in #BritishIndia. Not very often do you get these kinds of films and Characters. Tell us how special the movie is?

– The period film is quite hard to make I must say, it’s expensive to make, takes so much time to go back into those times, with all the costumes they also have to get the looks correct so I do think that movie is extremely special that way. About my look, it’s quite special to me as I have never done that look, hair, red lips jazz type of music. So I am extremely excited about it.

Q; A lot is being said about your special song in the movie. How is it going to be?

– I worked on this film as a special song only. I hope it’s gonna be a big one I hope people are gonna like me and this song as well I am new to this industry I hope I get a lot of love.

Q; How is it working with Kalyan Ram?

– Working with #KalyanRam sir was an unforgettable experience, he was very quiet and shy on set but yes he was really helpful and I had a great time. Especially in my scene with him where I had to say dialogues in #Telugu and he was very helpful, I am not well versed in Telugu, but I know 7 languages and I would love to learn #Telugu as well if I get to do more work.

Q; What is the difference between working in #Tollywood and #Bollywood?

– I can’t say anything on this as I am extremely new here in #Tollywood but as of now it’s the same. Everyone is equally professional.

Q; How confident are you about the film? Do you think the film will be a game- changer in your career?

– It all depends on the audience how much they love the film. How much my character and song have an impact. I am confident about all the actors, directors, and production house as we all gave our 100% so let’s see what happens.

Q; Besides doing films, you are also actively doing television. How are you balancing both?

– Besides films, I do web shows, and I sing as well I am balancing all of this. I think I am good at balancing it I love doing everything. You need to find a balance when you love the Rush, that stressful life constantly flying here and there finishing this and that so yes I love this kind of a life.

Q; In the next two years, how are you going to see yourself?

– I can’t say but definitely I want to give more attention to music, I love singing which I started in 2022 by now I have released 2 songs and my 3rd song is also coming. I would love to do more Telugu films for sure.

Q; What are your upcoming films?

– #Sangeen with #Nawazuddin Siddiqui it’s a thriller, #Raneeti it’s a series that will be released on #Jiocinema, my song #Woah will also be coming there so there are multiple projects in the pipeline you will get to know soon..

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com