ఏలూరు జిల్లా కైకలూరు : కొల్లేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతం నుంచి కొల్లేరుకు వరద ప్రవాహం అధికమైంది ఈ క్రమంలో కైకలూరు మండవల్లి మండలంలోని పెద్దడ్ల గాడి చిన్నడ్ల గాడి ఆటపాక ఏలూరు గ్రామీణ మండలం కోమటి లంక ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పి ప్రతాప్ శివ కిషోర్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. కొల్లేరు లంక గ్రామస్తులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు వేటకు వెళ్లొద్దని కోమటిలంక నుంచి ఆటపాకకు కొల్లేరు సరస్సుల్లో నాటు పడవలపై ఎట్టి పరిస్థితులను ప్రయాణాలు సాగించొద్దని సూచించారు. కోమటి లంకలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిత్యవసర సరుకులు తాగునీరు అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.