Tuesday, May 20, 2025

ఏం జరిగిందో తేల్చండి చార్మినార్ అగ్నిప్రమాదంపై విచారణకు కమిటీ

చార్మినార్ లోని గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ నెల 18 వ తేదీన చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జారి హౌజ్ వద్ద అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సివి ఆనంద్, తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సిఎండి ముషారఫ్ ఉండనున్నారు.
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలతో పాటు ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై విచారణ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా క్షేత్రస్థాయి ప్రజలకు సూచనలు ఇవ్వడం, స్థానిక పరిస్థితులు అంచనా వేసి భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతిపాదనలు సూచించాలని కమిటీని ఆదేశించారు. ఆదివారం ఉదయం చార్మినార్ పరిధిలోని గుల్జార్ హూస్‌లో ముత్యాల వ్యాపారి నివాసం ఉంటున్న బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎసీ కంప్రెషర్ పేలడంతో మంటలు చెలరేగి కిచెన్ రూంలో ఉన్న సిలిండర్ సైతం పేలడంతో ఊహించని విధంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో 21 మంది ఉండగా 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు అతికష్టమ్మీద రూఫ్ మీద నుంచి పక్కన ఇంట్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం ఉదయం దాదాపు 6 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. 6.15కు సమాచారం రాగానే మొగల్ పురా నుంచి ఫైరింజన్ బయలుదేరినట్లు మంత్రులు, అధికారులు తెలిపారు. ఆపై గుల్జార్ హౌస్ వద్దకు 10 ఫైరింజన్లు చేరుకుని అతికష్టమ్మీద మంటలు ఆర్పివేశాయి. ఇంట్లోకి వెళ్లేందుకు వీలుకాక, తలుపులు బద్దలుకొట్టి రెస్క్యూ టీమ్ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి 17 మంది స్పృహతప్పి ఉన్నారు. వారందర్నీ అంబులెన్స్ లలో మలక్‌పేట యశోద, డీఆర్‌డీవో అపోలో హాస్పిల్, ఉస్మానియా హాస్పిటల్స్ కు తరలించారు. వారిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే కొందరు చనిపోయగా, మరికొందరు హాస్పిటల్ చేరిన నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com