Wednesday, March 26, 2025

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌

‌ముగ్గురు మావోయిస్టులు మృతి – మృతుల్లో దండకారణ్య స్పెషల్‌ ‌జోన్‌ ‌కమిటి సభ్యుడు సుదీర్‌ అలియాస్‌ ‌సుధాకర్‌ అలియాస్‌ ‌మురళిపై 25 లక్షల రివార్డు వరంగల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు 

ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బీజాపూర్‌ ‌ప్రాంతంలోని గీడం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా గ్రామాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో దంతెవాడ డిఆర్‌జి మరియు బస్తర్‌ ‌భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్ళినట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవరాయ్‌ ‌తెలిపారు.
మంగళవారం ఉదయం నుండే ఆ ప్రాంతంలోకి భద్రత బలగాలు వెళ్ళగా మావోయిస్టులు గమనించి కాల్పులు జరుపడంతో ప్రతిగటించిన భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులను ఒకరు దండకారణ్య స్పెషల్‌ ‌జోన్‌ ‌కమిటటి సభ్యుడు సుధీర్‌ అలియాస్‌ ‌సుధాకర్‌ అలియాస్‌ ‌మురళిగా గుర్తించారు.  ఈయన వరంగల్‌ ‌జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించినట్లు బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు తెలిపారు. మిగత ఇద్దరు మావోయిస్టులను గుర్తించేందుకు పోలీస్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన స్థలం నుండి ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ ‌రైఫిల్‌ , 303 ‌రైఫిల్‌, 12 ‌బోర్‌ ‌రైఫిల్‌ ‌మరియు పేలుడు పదార్ధాలు లభించినట్లు తెలిపారు. ప్రతీరోజు డిఆర్‌జి ఎస్‌టిఎఫ్‌ , ఐటిబిపి సిఐఎఫ్‌  ‌బస్తర్‌ ‌రేంజ్‌లో కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నట్లు బస్తర్‌ ‌రేంజ్‌ ఐజి సుందర్‌ ‌రాజు తెలిపారు.  గడిచిన 83 రోజుల్లో వంద మంది మావోయిస్టులను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన ప్రాంతాన్ని ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు దంతెవాడ రేంజ్‌ ‌డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌కమలోచన్‌, ‌కశ్యం తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com