Sunday, April 13, 2025

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎన్ కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి – మరికొందరికి గాయాలు
గాయాలు తగిలిన మావోయిస్టుల కోసం గాలింపు

ఛత్తీస్‌గఢ్ లోని అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డిఆర్‌జి, బీజాపూర్‌, ‌డిఆర్‌జి దంతెవాడ, ఎస్‌టిఎఫ్‌, ‌కోబ్రా, కోబ్రా 210, 202 బృందం కూంబింగ్‌ ‌నిర్వహించినట్లు ఎస్పీ జితేందర్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. మరికొందరు గాయాలపాలైనట్లు భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్  రాష్ట్రంలోని బస్తర్‌ ‌డివిజన్‌ ‌బీజాపూర్‌ ‌జిల్లా అడవుల్లో నేషనల్‌ ‌పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేంద్రకుమార్‌ ‌తెలిపారు. మరి కొంతమంది గాయాలు  పాలైనట్లు వారి కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నట్లు తెలిపారు.

చనిపోయిన ముగ్గురు మావోయిస్టులలో ఇద్దరు మావోయిస్టులను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. అభేరి పేలుడు సూత్రదారి మట్వాడ ఎల్‌ఓఎస్‌ ‌కమాండర్‌ ,ఏసియం అనీల్‌ ‌పూనెం మృతి చెందారు. ఇతనిపై 5 లక్షల రివార్డు ఉంది. సంఘటన స్థలం వద్ద 12 బోర్‌ ‌రైఫిల్‌, 3 ‌ముక్కల్‌ , ‌సింగల్‌ ‌షాట్‌ ‌రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రావతి నది ప్రాంతంలోని రిజర్వ్‌డ్‌ ‌ఫారెస్ట్‌లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత దళాలు శనివారం కూంబింగ్‌ ‌నిర్వహించారు. కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడటంతో వారిఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సుమారు  400 మంది జవాన్‌లు చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏకన్నగూడెంకు చెందిన 22 మంది కీలక కమాండర్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్‌ ఎదుట లొంగిపోయారు. ‘‘పోరు కన్నా ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి’’ అనే కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఎస్పీ శబరీష్‌ ‌తెలిపారు. ఇటీవల జరిగిన కాల్పుల్లో కూడా అగ్రనేతలు మృతి చెందడంతో భారీగానే మావోయిస్టుల పార్టీ నష్టపోతుంది. ఇప్పటివరకు వివిధ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ప్రాంతాల నుంచి 179 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 102 రోజుల్లో మొత్తం 121 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ ‌రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ‌జనరల్‌ ‌సుందర్‌ ‌రాజు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com