Wednesday, December 25, 2024

ఫార్ములా, ఈ- రేసులో కేసులో కేటీఆర్​కు మరో షాక్​

  • ఈడీ ఎంటర్​
  • మనీ లాండరింగ్​ కింద కేసు నమోదు
  • ఫార్ములా, ఈ- రేసులో కేసులో కేటీఆర్​కు మరో షాక్​

ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. రాజకీయ వర్గాల్లో సెగలు రేపుతోంది. రాష్ట్ర ప్రజల్లో క్షణం.. క్షణం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసి ఏసీబీ రంగంలోకి దిగి శరవేగంగా విచారణను కూడా ప్రారంభించింది. కాగా శుక్రవారం తాజాగా ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు) సైతం కూడా రంగంలోకి దిగారు. ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ.. కార్ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు నుంచి ఊరటనిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చి గంటలు గడవకముందే.. ఈడీ బిగ్ ట్విస్ట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆయనపై పీఎంఎల్‌ఏ, మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డి పేర్లను చేర్చింది. దీని ఆధారంగానే ఈడీ సైతం కేసు నమోదు చేసి విచారణకు ఉపక్రమించింది.

ఇదిలా ఉండగా ఈ కేసులోకి ఎంటర్ అయిన ఈడీ శరవేగంగా అడుగులు వేస్తోంది. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని రాష్ట్ర ఏసీబీకి లేఖ రాయడంతో పాటు ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలపై ఆరా తీసింది. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని సైతం అందించాలని అడిగింది. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు హెచ్ఎండిఎ అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని కోరింది. అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అడిగినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించిన తేదీల వివరాలు ఇవ్వాలని కూడా అడగగా….వెను వెంటనే ఏసీబీ అధికారులు స్పందించి కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను ఈడీకి అందచేశారు. వాటిిని క్షున్నంగా పరిశీలించిన ఈడీ అధికారులు సాయంత్రం కేటీఆర్ పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. ఉదయం నుంచి శరవేగంగా పరిణామాలు చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాలు సైతం నిర్ఘాంత పోయాయి. ఒక దాని తరువాత ఒకటి చోటుచేసుకున్న పరిణామాలను చూస్తుంటే….ఇక కేటీఆర్ కు ఈడీ చిక్కులు తప్పేట్లు కనిపించడం లేదు. ఓ కేసులో కాస్త ఊరట లభించిందని భావించగానే.. ఈడీ రూపంలో మరో షాక్ తగిలినట్లు అయింది.

క్వాష్‌ పిటిషన్‌
మరో వైపు ఫార్ములా ఈ… కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సింగిల్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఆ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదంటూ ఏసీబీ కౌన్సిల్ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కేటీఆర్ తరఫు న్యాయవాది చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ గురించి మెన్షన్ చేయగా.. పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు అందాయి.

దాన కిషోర్ ఫిర్యాదుతో…..
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీసంస్థకు సొమ్ము చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అప్పటి మున్పిల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయనను ఏ1గా, సీనియర్ ఐఏఎస్‌ అరవింద్ కుమార్‌ ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏ3గా చేర్చారు. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ.. సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ మేరకు కేటీఆర్‌తో సహా మరో ఇద్దరిపై కేసులు ఫైల్ చేస్తూ.. విచారణ ప్రారంభించారు. ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (సీఐయూ) డీఎస్పీ మాజిద్‌ అలీఖాన్‌ విచారణను ముమ్మరం చేశారు. ఇవాళ దాన కిషోర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయటంతో పాటు.. హెచ్‌ఎండీఏ ఆఫీసులో ఫైల్స్ పరిశీలించనున్నారు.

నా తప్పు లేదు
కాగా ఫార్ములా-ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ వెల్లడించారు. అసలు ఆ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. కేవలం సీఎం, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి, కుంభకోణాలను బయట పెడుతున్నందుకే.. తమపై రాజకీయ వేధింపులకు దిగుతోందని ఆరోపించారు. ప్రపంచ పటంపై హైదరాబాద్‌ ఖ్యాతిని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో.. నగరంలో ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహించాలని ప్రయత్నం చేశామన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com