గండిపేట్ : మితిమీరిన వేగంతో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి చెందాడు. మరో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులకు తీవ్ర గాయాలకు గురయ్యారు. వివరాల ప్రకారం.. గండిపేట్ మండల పరిధిలోని ఎంజీఐటీ కళాశాలలో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకర్ (18) హేమసాయి (19) వివేక్ (19) సృజన్ (18) కార్తీకేయ (18) హర్షలు( 19 ) స్విఫ్ట్ కారు (టీఎస్ 08 ఈజీ 4929) లో వెళ్తున్నారు.
డ్రైవింగ్ చేస్తున్న శ్రీకర్ కారు తీసుకెళ్తుండగా నియోపోలిస్ రోడ్ లో కారు అదుపు తప్పి విద్యుత్ పోల్ ను ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే శ్రీకర్ మృతి చెందాడు. వీరిలో హర్ష సాయి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రీకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.