Friday, September 20, 2024

మాకేం తెలియదు

  • కాళేశ్వరం డిజైన్లపై ఇంజినీర్ల విచారణ
  • పొంతనలేని సమాధానాలు చెప్పిన డిజైన్​ ఇంజినీర్లు
  • ఇంజినీర్లను ప్రశ్నించిన జస్టిస్​ పీసీ ఘోష్

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై ఇంజినీర్లను జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ప్రశ్నించింది. వారిని డిజైన్ల గురించి అడిగితే పొంతలేని సమాధానాలు చెప్పారు. ప్రాజెక్టు డిజైన్​ తయారు చేసే ముందు సైట్​ విజిట్​ కచ్చితంగా చేయాల్సిన అవసరం లేదని ఇంజినీర్లు కమిషన్​తో పేర్కొన్నారు. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ మంగళవారం సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​కు చెందిన ఐదుగురు ఇంజినీర్లను ప్రశ్నించింది. గతంలో అఫిడవిట్లు దాఖలు చేసిన సీడీఓకు చెందిన విశ్రాంత ఎస్ఈలు, ఈఈలు కమిషన్ ముందు హాజరయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన డిజైన్ల ఆమోదానికి ముందు అనుసరించిన నిబంధనలు, ఆమోదం అనంతరం మార్పులు-చేర్పులు, ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులు, లొకేషన్స్ తదితరాల గురించి జస్టిస్ పీసీ ఘోష్ ఇంజినీర్లను ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు కొంత మంది పొంతనలేని సమాధానాలు ఇవ్వడంపై జస్టిస్ పీసీ ఘోష్​ అసహనం వ్యక్తం చేశారు.

బ్యారేజీలను డ్యామ్​లుగా మార్చే అంశంలో రామగుండం సీఈ లేఖ విషయమై స్పష్టత లేని సమాధానం ఇచ్చిన ఇంజనీర్​పై జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫిడవిట్​లోని అంశాలకు భిన్నంగా సమాధానాలు చెప్పడాన్ని కూడా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీలో సీడీఓ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారని ఇంజినీర్లు తెలిపారు. డిజైన్​ తయారు చేసే ముందు సైట్​ విజిట్​ కచ్చితంగా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్​ మారినట్లు ఇంజినీర్లు జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ముందు పేర్కొంది. ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల వల్లే మార్పులు జరిగాయని చెప్పారు.

సీడీఓ, ఎల్​ అండ్​ టీ వేర్వేరుగా డిజైన్లు తయారు చేసి తుది ఆమోదం కోసం అన్ని ఒకే దగ్గర చేసినట్లు ఇంజినీర్లు వివరించారు. డిజైన్ల ఆమోదం కోసం అన్ని ఒకే దగ్గర చేసినట్లు ఇంజినీర్లు చెప్పారు. డిజైన్ల ఆమోదం తర్వాత అన్నారం బ్యారేజీకి సంబంధించి మార్పులు జరిగినట్లు పేర్కొన్నారు. అయితే, మూడు బ్యారేజీలకు సంబంధించిన డిజైన్లలో ఎలాంటి సమస్యా లేదని, నిబంధనల ప్రకారమే డిజైన్లు ఉన్నాయని ఇంజినీర్లు తెలిపారు. ఓ సమస్య వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమని ఇంజినీర్లు కమిషన్​ ముందు చెప్పారు. సీకెంట్​ ఫైల్స్​ కదలడం వల్లే సమస్య వచ్చిందని రిటైర్డ్​ఇంజినీర్​ సత్యనారాయణరెడ్డి జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​కు వివరణ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Ritu Sharma Latest Photos

Ishitha Raj Spicy Pics

Shruthi Hassan Latest Albhum