Wednesday, February 26, 2025

ఇంగ్లీష్ రాని ప్రాజెక్ట్ మేనేజర్ ‘విజ్ఞాన్ కుమార్’ క్యారెక్టర్

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి జీవన్ కుమార్ నటించిన ఇంగ్లీష్ రాని ప్రాజెక్ట్ మేనేజర్ ‘విజ్ఞాన్ కుమార్’ క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. విగ్ పెట్టుకునే విజ్ఞాన్ కుమార్ ఇంగ్లీష్ రాకున్నా ప్రాజెక్ట్ మేనేజర్ గా తన టీమ్ ను ఎలా లీడ్ చేశాడు, ఇలాంటి ప్రాజెక్ట్ మేనేజర్ తో ఇతర ఎంప్లాయిస్ ఎలాంటి పాట్లు పడ్డారు అనేది ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com