Tuesday, May 6, 2025

ఎంత మంది వచ్చినా.. రాజకీయం అంటేనే మేము- బాలకృష్ణ

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ప్రస్తుతానికి కలిసిపోయారు కానీ, గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం అధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కసును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు…అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో గట్టిగానే కౌంటరిచ్చేవారు. బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు. ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటైర్లు వేశారు. జనసేన సభలకు వెళ్లే వారు అలగాజనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. అయితే తాజాగా బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పారు. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా మాదిరిగానే ఇలా 50 ఏళ్లు హీరోగా నటించిన వారు ఎవరూ లేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీపై కూడా మాట్లాడారు. రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు. నామరూపాలు లేకుండా పోయారు. అడ్రస్ లేకుండా పోయారని చెప్పి కాస్తా ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన తన పార్టీని ముందుకు నడిపించలేకపోయారు. దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత చిరంజీవి క్రియాశీల రాజకీయల నుంచి తప్పుకున్నారు. దీనిలో భాగంగానే చిరంజీవిని ఉద్దేశించే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com