Tuesday, May 13, 2025

వాళ్లు ఏవరో నాకు తెలియదు మాజీ మంత్రి ఎర్రబెల్లి

టీఎస్, న్యూస్ :మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నాయని అన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేకమంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శరణ్‌ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నాడని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్నారైలను కూడా కోట్ల రూపాయాలు మోసం చేసినట్లు తెలిసిందని వెల్లడించారు. అతని తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

విజయవాడకు చెందిన విజయ్‌ అనే ఎన్నారై దగ్గర శరణ్‌ చౌదరి రూ.5 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. విజయ్‌ ఎవరో తనకు పరిచయం లేదని వెల్లడించారు. ఎన్నారైలు విజయ్‌ని తన దగ్గరికి తీసుకొచ్చారని, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించాని తెలిపారు. శరణ్‌ చౌదరిపై అనేక చీటింగ్‌ కేసులు ఉన్నాయని, అతనితోపాటు ఆయన భార్య పాస్‌ పోర్ట్‌ కూడా పోలీసులు సీజ్‌ చేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ విజయ్‌ పంపించిన వీడియోను మీడియాకు చూపించారు. తనకు ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ఎలాంటి సంబంధం లేదని విజయ్‌ అన్నారు. రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టాలని శరణ్‌ చౌదరి కోరాడని, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమను మోసం చేశాడని చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com