Monday, May 19, 2025

ఎటో వెళ్లిపోయింది మనసు’ రీ రిలీజ్

ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. అసలే టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండగా.. ఇప్పుడు నాని, సమంతల క్యూట్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకు రాబోతున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com