Wednesday, March 19, 2025

ఎట్టకేలకు భేటీ మాజీ ఎమ్మెల్యేకు సీఎం అపాయింట్‌మెంట్‌

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పలు సమస్యలను సీఎంకు వివరించి.. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు గుమ్మడి నర్సయ్య వచ్చారు. అయితే, అపాయిట్మెంట్ లేదని భద్రతా సిబ్బంది ఆయనను లోనికి పంపించలేదు. దీంతో నర్సయ్య సీఎం కాన్వాయ్ కోసం రోడ్డు పక్కన నిల్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమ్యూనిస్టు పార్టీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్యను సీఎం రేవంత్ అవమానించారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి.

అసెంబ్లీలో స్పందించిన రేవంత్
ఈ అంశంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో రెండ్రోజుల క్రితం స్పందించారు. గుమ్మడి నర్సయ్య వచ్చిన విషయం తనకు ఆ సమయంలో తెలియదని.. తెలిసిన వెంటనే తన కార్యాలయ సిబ్బందితో నర్సయ్యకు ఫోన్ చేయించినట్లు చెప్పారు. అయితే అప్పటికే ఆయన ఊరు వెళ్లినట్లు చెప్పారన్నారు. మళ్లీ వచ్చిన తర్వాత కలుస్తానని నర్సయ్య తన ఆఫీసు అధికారులకు చెప్పినట్లు వివరించారు. కమ్యూనిస్టులు అంటే తనకు అపారమైన గౌరవమన్నారు. వారు ప్రజా సమస్యల గురించే తనను కలిసే ప్రయత్నాలు చేస్తారు కానీ వ్యక్తిగత పనుల కోసం రారన్నాను. ఈ నేపథ్యంలోనే గుమ్మడి నర్సయ్య.. సీఎంను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సయ్య వెంట మంత్రి సీతక్క, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ తదితరులు ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com