Sunday, November 17, 2024

సింగరేణిలో రేపే పోలింగ్‌.. సర్వం సిద్ధం..

సింగరేణి ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణ లోని ఆరు జిల్లాల పరిధిలో కొల్ బెల్ట్ ఏరియాలో హోరాహోరిగా ప్రచారం ముగిసింది. చివరి రోజు ప్రచారంలో హేమహేమి నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఓట్లను అకట్టు కోవడానికి అధికార పార్టీ మంత్రులు సింగరేణి కార్మికులకు పలు వరాలను ప్రకటించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు, బుధవారం జరిగే పోలీంగ్‌ కు సింగరేణి అధికారులు సర్వం సిద్దం చేశారు. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరం లోని ఆరు జిల్లాల పరిధిలో 11 ఏరియాలో ఈ ఎన్నికల పోలీంగ్ జరగనుంది.

దాదాపు 40 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఈ సంస్థలో ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు ఎన్నికలు జరుగగా వీటిలో అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టియుసి ఓసారి, బిఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు విజయం సాధించాయి. ఏడో పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి తో పాటు బిఆర్‌ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి సంఘంతో పాటు మరో పది కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి తమ ఉనికిని కాపాడు కోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular