Wednesday, March 12, 2025

అంబానీ ఇంటపెళ్లిలో అందరూ పవన్ ను ఆ మాటే అడిగారట

* అంబానీ ఇంటపెళ్లిలో అందరూ పవన్ ను ఆ మాటే అడిగారట
* జనసేన నేతలతో గర్వంగా చెప్పిన పవన్ కళ్యాణ్

ఆసియాలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకకు హాజరై వచ్చిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ఆసక్తికరమైన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడంపైనే సర్వత్రా చర్చ జరుగుతోందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక పెళ్లిలోను అందరూ తనను వందకు వంద శాతం జనసేన సాధించిన ఫలితాల గురించే అడిగారని చెప్పుకొచ్చారు పవన్.

మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం సందర్భంగా పవన్‌ కళ్యాణ్ ఈ విషయం గురించి చెప్పారు. ఇలా వందశాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందటం అంత ఆశామాషీ వ్యవహారం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఐతే ఈ విజయంతో పొంగిపోకుండా బాధ్యతగా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రతినిధులే కాకుండా జనసేన నేతలు, కార్యకర్తలు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు పవన్ కళ్యాణ్. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోను జనసేన సత్తా చాటాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com