రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు
ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం
ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, అసెంబ్లీ లోపల ప్రశ్నిస్తే సస్పెన్షన్ విధించి గొంతు నొక్కుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. జగదీశ్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సస్పెండ్ చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు సభ్యులు మధ్యలో అడ్డుకునే యత్నం చేస్తే. స్పీకర్ వారిని అదుపు చేసి శాసనసభను ప్రశాంతంగా నడిపించాలని కోరారు. అసెంబ్లీలో ప్రజల సమస్యపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ ని ప్రతిపాదించినప్పుడు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తు అంబేడ్కర్ విగ్రహాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పార్టీ పేరు పెట్టింది కేసీఆర్.
దేశంలో ఎక్కడా లేనివిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది. దళితులను వోటు బ్యాంకుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. బాబాసాహెబ్ అంబేడ్కర్ ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగ్జీవన్ రావు కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే వారు కొత్త పార్టీ పెట్టుకున్న విషయం కూడా అందరికి తెలుసు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అధీర్ రంజన్ చౌదరి , సోనియా గాంధీ ద్రౌపది ముర్మూని అవమానించారు. స్పీకర్ కి శ్రీధర్ బాబుకి బీఆర్ఎస్ పక్షాన శాసనసభ్యులను వెళ్లి వివరణ ఇచ్చాం. జగదీష్ రెడ్డి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు అలా మీరు భావిస్తే రికార్డులను చూపించాలని కోరాం. సభ జరగాలి కాబట్టి మా తప్పు ఉన్నట్లయితే మేము క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పాం.. ఉరి తీసేటప్పుడు కూడా మీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు.
సస్పెండ్ చేసిన సభ్యుడి వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పు చేయకపోయినా సభాలో క్షమాపణ చెప్తామని కూడా చెప్పాం. పథకం ప్రకారం ముందే అనుకొని బీఆర్ఎస్ సభ్యుని సస్పెండ్ చేశారు. ప్రశ్నించే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను కుట్రపూరితంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పై జగదీశ్ రెడ్డి ఏక వచనం వాడకపోయినా ఏక వచనం వాడారని సస్పెండ్ చేయడం దుర్మార్గం. కౌల్ అండ్ శక్దర్ పుస్తకంలో ఎక్కడ కూడా (యు) నీ అనే పదాన్ని నిషేధించలేదు.. అయినా సరే మేము ఎక్కడ స్పీకర్ ని ఏకవచనంతో సంబోధించలేదు. రాహుల్ గాంధీ మీరు చెప్పే ప్రజాస్వామ్య పరిరక్షణ ఇదేనా. ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.