Thursday, May 29, 2025

కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై హస్తం పార్టీలో తిరిగి చేరేది లేదు

సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. రాజకీయంగా తాను ఏ పార్టీలోకైనా వెళ్తాను కానీ, హస్తం పార్టీకి మాత్రం తిరిగి రానని చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామ సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కోనేరు ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తనకు ఏ పార్టీ అండ అవసరం లేదని కార్యకర్తలు, ప్రజలే తన బలమని పేర్కొన్నారు.
ప్రస్తుతం పోడు రైతులు అటవీ అధికారుల ఒత్తిడికి గురవుతున్నారని, వారికి ఎళ్లప్పుడూ అండగా ఉంటానన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు పోడు రైతుల పట్ల స్పష్టమైన హామీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు సిర్పూర్ అభివృద్ధి కోసం అభ్యర్థించినా స్పందించలేదన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పోడు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ దేవుడని, ఆయనకు పాదాభివందనాలని కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడే తాను చెప్పానని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని పార్టీలో తీసుకునేటప్పుడు చెప్పలేదనే బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చానని అన్నారు. రాజకీయంగా బిఆర్ఎస్ పార్టీతోను, కేసీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాజకీయంగా ఏదైనా పార్టీలోకి పోవాల్సి వస్తే వెళ్తా.. కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం అస్సలు వెళ్లనని తేల్చి చెప్పారు. అయితే ఇదివరకే ఆయన పార్టీని వీడే ప్రయత్నం చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీతో పార్టికి దూరంగా ఉన్న అలాగే ఉండిపోయారు.

పార్టీలోనూ కనిపించని ప్రాధాన్యత.. రూట్ మార్చిన మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపట్టాలని కోరగా పనులేమి ముందుకూ సాగడం లేదు, పార్టీలోనూ సరెైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తన నిర్ణయం మార్చుకున్నారు. ఆదివారం తన అనుచరులు, అభిమానులతో సమావేశమై ఈ కీలకమైన విషయాలను వెల్లడించారు. మొత్తానికి కోనప్ప రాజకీయంగా ఎదైనా పార్టీలోకి వెళతాను గానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం అస్సలు వెళ్ళనని తేటతెల్లం చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై అంటూ కోనేరు కోనప్ప తన ఆవేదనని మీడియా ముఖంగా చెప్పేశారు. త్వరలో కొనప్ప ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com