Monday, March 10, 2025

1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు

టీఎస్, న్యూస్ :తెలంగాణ లోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 8, 10, 13, 15 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక 6 నుంచి 8 తరగతుల పరీక్షలు.. ఏప్రిల్ 8, 10, 13, 15, 16, 18 తేదీల్లో జరగనున్నాయి.
ఒక్క 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com