Wednesday, November 20, 2024

పేదల అసైన్డ్ ‌భూములను లాక్కోవొద్దు

  • దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల ఆందోళన..
  • అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్‌. అధికారులపై ఫైర్‌

అసైన్డ్ ‌భూములను ఇష్టం వొచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికీ లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల లబ్దిదారులు శనివారం ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన ఎంపీ ఈటల రాజేందర్‌ అధికా రులపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. అసైన్డ్ ‌భూములు  తాత జాగీరు కాదంటూ ముఖ్యమంత్రికి హెచ్చరి ంచారు. కుత్బుల్లపూర్‌ ‌నియోజకవర్గం దుండిగల్‌ ‌మున్సిపాలిటీ దుండిగల్‌ ‌గ్రామంలో సర్వే నెంబర్‌ 453, 454 ‌లలో ఉన్న లవాని పట్టా 450 ఎకరాల భూమిలో కొంత భూమిలో డబుల్‌ ‌బెడ్లు నిర్మిం చారు. మిగతా 410 ఎకరాల్లో ఉన్న రైతులకు ఎలా ంటి నష్ట పరిహారం ఇవ్వకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 600 మందికి 60 గజాల ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చారన్నారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ భూమికి పట్టాలు ఇప్పిస్తామని రేవంత్‌ ‌రెడ్డి హామీ కూడా ఇచ్చారనీ.. ఇప్పుడు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని. తెలియడంతో అక్కడికి వెళ్ళిన ఎంపీ ఈటల రాజేందర్‌..‌రైతులకు అండగా నిలిచారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ… ఈ భూముల్లో 40 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ భూముల్ని ఇష్టం వొచ్చినట్టు తీసుకోవచ్చని అధికారులు మాట్లాడుతున్నారు.. కేసీఆర్‌ ‌ప్రభుత్వం కూడా ఇలానే చేసి నాశనం అయ్యింది. అసైన్డ్ ‌భూము లను ఇష్టం వచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికి లేదు. రింగ్‌ ‌రోడ్డు అప్పుడు కూడా ఇలానే  అసైన్మెంట్‌ ‌భూములను రూపాయి ఇవ్వకుండా గుంజుకుంటుంటే రాజశేఖర్‌ ‌రెడ్డితో కొట్లాడామని తెలిపారు. పట్టా భూములతో  సమానంగా అసైన్డ్ ‌భూములకు కూడా నష్టపరిహారం ఇచ్చేవరకు వదిలిపెట్టలేదన్నారు.

ప్రభుత్వానికి అవసరమైతే అదికూడా ప్రజలకోసం అయితే నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలన్నారు.. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ‌బ్రోకర్‌ ‌కాదు. ప్రజల్ని బెదరగొట్టి పోలీసులతో పిచ్చిపిచ్చి వేషాలు వేయడం మంచిదికాదన్నారు. రైతుల తరఫున నేనే కోర్టుకు పోతా. అనేక రాష్ట్రాల్లో  15 ఏళ్లు దాటిన తర్వాత అసైన్డ్ ‌భూములపై సంపూర్ణ హక్కులు ఇచ్చేస్తారు. తమిళనాడు, యూ పీలో  ఇలాగే ఇచ్చారు. కేసీఆర్‌ ‌కూడా ఇస్తానని ఇవ్వలేదు. కడు బీదరికంలో ఉన్నవారికి భూమి ఇచ్చారు. నేను మీవెంట ఉంటా.. భూములు గుంజుకుంటె చూస్తూ ఊరుకునేది లేదు.పేదలను వేధించే అధికారం ఎవరికీ లేదు. వారికి ఎవరూ దిక్కులేదు అని అనుకోవద్దు.ఈ భూములు అమ్ముకుంటే రెస్యూమ్‌ ‌చేయండి. కానీ గుంజుకు ంటామంటే ఊరుకునేది లేదంటూ అధికారులపై ఈటల రాజేందర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular