తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్ల తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 58 నుంచి 67 సీట్లు సాధిస్తుందని ఆరా ప్రీ పోల్ సర్వే వెల్లడించింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి 41 నుంచి 49 సీట్లు వచ్చే అవకాశముందని, బీజేపీ 5 నుంచి 7 సీట్లు సాధిస్తుందని తెలియజేసింది. ఎంఐఎం, బీఎస్పీ, సీపీఐ వంటి పార్టీలకు కలిపి సుమారు 9 సీట్లు వస్తాయని తెలియజేసింది. రాజనీతి స్ట్రాటజీస్ సంస్థ సర్వేలో కాంగ్రెస్‌కు 56+5 సీట్లు, బీఆర్ఎస్‌కు 45+ 5, బీజేపీకి 10+2, ఎంఐఎం 7 సీట్లలో గెలుస్తుందని అంచనా వేసింది. సీపాక్ సర్వేలో కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 41, బీజేపీ 4, బీఎస్పీ 2, ఎంఐఎం5, ఎంబీటీ 1, సీపీఐ 1 సీట్లను సాధిస్తుందని తెలియజేసింది. కేస్ స్టడిస్ సర్వేలో కాంగ్రెస్ 70+5 సీట్లు, బీఆర్ఎస్ 29+6, బీజేపీ మరియు ఇతరులు 13+2, ఎంఐఎ 7 సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో కాంగ్రెస్ 67 నుంచి 78 సీట్లు, బీఆర్ఎస్ 22-31 సీట్లు, బీజేపీ 6-9 సీట్లను గెలుస్తుందని తెలియజేసింది.
కొల్లాపూర్లో బర్రెలక్కకు ఎన్ని వేల ఓట్లంటే.. సర్వే
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) కు 15 వేల ఓట్లు రావచ్చని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బర్రెలక్క గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తారని ఈ సర్వే వెల్లడించింది.