Monday, March 10, 2025

జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ గడువు పొడిగింపు

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలల పాటు గడువు పొడిగించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్ గడువు నెలాఖరు వరకు ఉంది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ లోపు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరిగిన అక్రమాలపై విచారణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ పీజీ ఘోష్​ కమిషన్​ నియమించిన విషయం తెలిసిందే. ఈ నెలతో కమిషన్​ గడువు ముగుస్తుండటంతో.. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోరెండు నెలల పాటు గడువు పెంచారు.
అయితే, కమిషన్​ ముందు విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, మాజీ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆఫడవిట్లు దాఖలు చేయాలని కమిషన్​ ఆదేశించింది. దీంతో గురువారం వరకు దాదాపు 60 మంది సీల్డ్​ కవర్లలో అఫడవిట్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కమిషన్​ గడువు ముగుస్తుండటంతో.. గడువు పెంచడం అనివార్యమైంది. అంతేకాకుండా పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో విచారణ కూడా ఆలస్యమైంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. కమిషన్​ గడువును ఆగస్టు 31 వరకు పెంచింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com