Saturday, January 4, 2025

2024లో విజ‌యాల కంటే వైఫ‌ల్యాలే ఎక్కువ‌..

2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా.. వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని,  ⁠ఎన్నికల సమయంలో ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా తీయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఎద్దేవాచేశారు.  అభయ హస్తం ప్రజలను భయపెట్టే, బాధ పెట్టే హస్తంగా మారింద‌ని, వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు 390 రోజులు గడిచినా మొదలు కాలేదన్నారు. గ్యారంటీలు అమలు చేయమంటే గారడీల విన్యాసం చేస్తున్నారని, ఏడాది పాలన తర్వాత అనేక సర్వే ఏజెన్సీలు ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నాలు చేశాయి.

⁠ఏ సర్వేలో కూడా రేవంత్ కు పాస్ మార్కులు కూడా రాలేదు. ఎవరిని అడిగినా రేవంత్ ను తిడుతున్నారు.  డిక్లరేషన్లు అమలు చేసే బదులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే పగబడుతున్నారు. పాలసీ ఏదీ అంటే పోలీసులను పంపుతున్నారు.  కిట్ల స్థానంలో కాంగ్రెస్ మార్కు తిట్లు వచ్చాయ్. ఎన్నికలప్పుడు బోనస్ మాటలు.. ఇపుడేమో బోగస్ మాటలు. ఎన్నికలప్పుడు అన్ని పంటలకు బోనస్ అన్నారు.  ఇపుడు ఒక పంటకు మాత్రమే అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి. రుణ మాఫీ చివర విడత చెక్కు అని హంగామా చేశారు. ఇంకా డబ్బులు రైతుల అకౌంట్లలోనే జమ కాలేదు. వరంగల్‌లో మహిళా సంఘాలకు ఇచ్చిన చెక్కుల డబ్బులు కూడా వారికి చేరలేదు.  విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు కూడా అమలు కాలేదు.  బీఆర్ఎస్ నాయకులపై క్షణాల్లో కేసులు పెడుతున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదుచేస్తే పట్టించుకోవడం లేదు అని హ‌రీష్‌ రావు మండిప‌డ్డారు.

గురుకులాల‌ను గాలికొదిలేశారు..
కాంగ్రెస్ నేతలు చెప్పిందే పోలీసులు అమలు చేస్తున్నారు.  కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల మీద ధ్యాసే తప్ప కమిట్ మెంట్ లేదు. కేసీఆర్ గొప్పగా నెలకొల్పిన గురుకులాలను గాలికి వొదిలేశారు.  విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఫైర్ అయ్యారు. ఉద్యోగులు, నిరుద్యోగులకిచ్చిన హామీలు ఉత్తవే అయ్యాయని, 2 లక్షల ఉద్యోగాలు అని 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు.
* రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వక్ర మార్గం పట్టిస్తున్నారు.  అప్పులపై అబద్దాలే ..హామీల అమలుపై అబద్దాలే.. అసెంబ్లీలో కూడా అడ్డూ అదుపు లేకుండా అబద్దాలు చెబుతున్నారు.  అంబేడ్కర్ రాజ్యాంగం పోయి అనుముల రాజ్యాంగం వొచ్చింది. రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర పనులు శృతి మించుతున్నాయ్ . హైడ్రా పేరిట సామాన్యులకు నిద్ర లేకుండా చేశారు. హైదరాబాద్ ఇమేజీని డామేజ్ చేశారు. రైతు బంధు ను విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు రాత్రి పగలు కష్టపడుతున్నారు.  ప్రజల బ్రతుకులు మార్చుతామని నమించి గద్దెనెక్కి తెలంగాణ తల్లి ని మార్చాడు. పోలీస్ లోగో మాత్రం మారింది  టీఎష్ నుంచి టిజిగా మారింది. ఇప్పుడు రాష్ట్ర లోగో కూడా ⁠మార్చుతామని అంటున్నారు.

అయితే, ప్రజల బ‌తుకులు మాత్రం మారలేదన్నారు. కాంగ్రెస్ బీజేపీల స్నేహం ఏడాదిలో మరింత బలపడింద‌ని హ‌రీష్ రావు విమ‌ర్శించారు. కాళేశ్వరం చిన్న రిపేరును కూడా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు.  లగచర్ల లో సీఎం భూ దందా బయట పడింది. అమాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని, అది మెట్రో అయినా ఫార్మా ప్రాజెక్టు అయినా ప్రభుత్వానికి ఏ విజన్ లేదన్నారు. అప్పులు అగాధంగా పెరిగాయి. అభివృద్ధి అదో పాతాళానికి వెళ్ళింద‌ని, ఏడాదిలోనే కాంగ్రెస్ కాలకేయ అవతారం, రేవంత్ రావణాసుర రూపం బయట పడ్డాయని ఫైర్ అయ్యారు.   ప్రజలు ఏం కోల్పోయామో గ్రహిస్తున్నారని హ‌రీష్ రావు అన్నారు.  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచడం వల్లే ప్రజలకు మేలు జరుగుతోంది ఈ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల‌ సమయం ఉంది  ఆరు గ్యారంటీలతోపాటు, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 420 అంశాలను అమలు చేయాల‌ని హ‌రీష్ రావు కోరారు. రాజకీయ కక్షలు మాని  రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com