Monday, November 18, 2024

సోషల్ మీడియాలో యాడ్ చూసి కాల్… కట్ చేస్తే రూ. 75 లక్షలు కొట్టేశారు

తమ వ్యాపారంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు వస్తాయన్నారు. కోటి రూపాయలు పెడితే 3 కోట్లు వస్తాయన్నారు. 300 శాతం లాభాలు గ్యారెంటీ అని నమ్మించారు. అది కూడా కేవలం ఏడాది లోపే మీ లాభాలు మీకు వచ్చేస్తాయని చెప్పడంతో వారి మాటలు నమ్మిన ఓ ఎన్నారై తాను విదేశాల్లో కష్టపడి సంపాదించిన సొమ్మును ఇండియాకు పంపించారు.

అలా ఇద్దరు వ్యక్తులు ఆ ఎన్నారై నుండి పెట్టుబడి పేరుతో దఫాల వారీగా రూ. 75 లక్షలు వరకు కాజేశారు. అయితే, ఒకానొక దశలో వీళ్ల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సదరు ఎన్నారై వారి పూర్తి వివరాలు ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తుల వ్యాపారం, దుకాణం ఎప్పుడో మూతపడింది కానీ ఇప్పటికీ వాళ్లు తమ పాత వ్యాపారం పేరు చెప్పుకునే ఇంకా జనం నుండి డబ్బు లాగి వారిని మోసం చేస్తున్నారని తెలుసుకున్న బాధితురాలు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు మోసం ఎలా జరిగిందంటే..
విదేశాల్లో ఉన్న బాధితురాలు సోషల్ మీడియాలో బ్రౌజ్ చేస్తుండగా ఆమెకు ఒక అడ్వర్టైజ్ మెంట్ కనిపించింది. సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టేందుకు ఫైనాన్షియర్ కావలెను అనేది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన చూసి టెంప్ట్ అయిన ఎన్నారై.. వారు చెప్పిన నెంబర్లలో సంప్రదించారు. అక్కడి నుండి వారి మోసం మొదలైంది.

తాను పెట్టుబడి పెట్టే సినిమా కథాంశం హిందూవాదం, సనాతన ధర్మం సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని ఆమె వారికి షరతులు పెట్టారు. వీడియో కాల్స్ ద్వారానే ఈ మాట ముచ్చట అంతా అయిపోయింది. అందుకు ఆ ఇద్దరు వ్యక్తులు స్పందిస్తూ.. తమ సినిమా ఎలా ఉంటుందంటే, కేవలం ఓటీటీల్లోనే కాదు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టీవీ ఛానెల్స్ సైతం తమ మూవీని ప్రదర్శించేలా సినిమా ఉంటుందని నమ్మించారు. అందుకోసం కనీసం రూ. 25 లక్షలు పెట్టుబడి కావాలని అడగడంతో ఆమె అలాగే ఇచ్చేశారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular