కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంటని మాజీమంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని విమర్శించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని ఎద్దేవా చేశారు. బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్కౌంటర్లు అంటూ ట్వీట్ చేశారు.