గతంలో ఎన్నడూ లేనంతగా 7.1 డిగ్రీలుగా నమోదు
హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 16: హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత ఆరేండ్లలో ఎన్నడూ లేనంతంగా కనిష్టానికి పడిపోయాయి. హెచ్‌సీయూ, మౌలాలీలో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2, గచ్చిబౌలి 9.3, వెస్ట్ మారేడుపల్లి 9.9, కుత్బుల్లాపూర్, మచ్చబొల్లారం 10.2, శివరాంపల్లి 10.3, జీడిమెట్ల 11.4, బాలానగర్ 11.5, పటాన్‌చెరు 11.7, షాపూర్‌నగర్ 11.7, లింగంపల్లి 11.8, బోయిన్‌పల్లి 11.9, బేగంపేట 12, ఆసిఫ్‌నగర్ 12, నేరెడ్‌మెట్ 12.1, లంగర్‌హౌస్ 12.2, మోండా మార్కెట్ 12.4, చందానగర్ 12.7, షేక్‌పేట 12.8, మాదాపూర్ 12.8, ముషీరాబాద్ 12.9, చాంద్రాయణగుట్ట 13, కూకట్‌పల్లి 13.1, గోల్కొండ 13.2, సఫిల్‌గూడ, హయత్‌నగర్ 13.3, ఉప్పల్ 13.4, మల్లాపూర్ 13.5, ఆదర్శ్‌నగర్ 13.5, తిరుమలగిరి, చర్లపల్లి 13.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 6.3 డిగ్రీలు రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా తాండ్రలో 6.3, ఆదిలాబాద్ జిల్లా పోచర 6.4, జైనాథ్ 6.5, అర్లి (టీ) 6.6, చాప్రాల్ 6.6, సంగారెడ్డి జిల్లా సత్వార్ 6.6, వికారాబాద్‌లోని బంట్వారం 6.7, సంగారెడ్డిలోని న్యాల్కల్‌లో 6.7, ఎలిమినేడు, రాచలూరు (రంగారెడ్డి) 6.7, సిర్పూర్ యూ (ఆసిఫాబాద్) 6.7, చందనపల్లి (రంగారెడ్డి) 6.7, కోహిర్ (సంగారెడ్డి) 6.7, మర్పల్లి (వికారాబాద్) 6.8, వికారాబాద్ జిల్లాలోని నగరం (టీ), మన్నెగూడలో 6.8, నల్లవెల్లి (సంగారెడ్డి) 6.8, పోతరరెడ్డిపేట (సిద్దిపేట) 6.9, జహీరాబాద్ (సంగారెడ్డి) 6.9, మెనూర్ (కామారెడ్డి) 6.9, రాఘవపేట (జగిత్యాల) 7.3, కెరమెరి (ఆసిఫాబాద్) 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి ఈదురుగాలులు, శీతల పవనాలు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.