Tuesday, March 18, 2025

ఫ్యామిలీస్టార్‌ ఫ్యామిలీతో కలిసి పుష్ప2 చూసిన రష్మిక

ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కలిసి నటించిన తాజా చిత్రం పుష్ప2. ఈ చిత్రం నిన్న విడుదలైన సంగతి తెలిసింది. ఇక ఈ అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న హీరోయిన్ రష్మిక .. నిన్న తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి ఈ సినిమాను వీక్షించింది. హైదరాబాద్‌లో మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ మాల్‌లో విజయ్ దేవరకొండ తల్లితో పాటు ఆయన సోదరుడు అనంద్ దేవరకొండతో కలిసి రష్మిక ఈ సినిమా చూసింది. ఈ సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో అల్లు అర్జున్ భార్యగా రష్మిక నటించగా, ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక .. తనకు వస్తున్న ప్రశంసలపై స్పందిస్తూ అందరికీ థాంక్స్ చెబుతూ పోస్టులు పెడుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com