Friday, September 20, 2024

“ఓహ్!” మూవీ టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ సినీ రచయిత భాష్యా శ్రీ

జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కులుమునాలి, ఆగ్రా, గోవా, హైదరాబాద్ వరంగల్ వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర టీజర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో ఇటీవల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ సినీ గేయ రచయిత భాష్య శ్రీ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.

అనంతరం చిత్ర సమర్పకురాలు బి ఆర్ ఆర్ గ్రూప్స్ అధినేత్రి శ్రీమతి జీవిత బడుగు మాట్లాడుతూ : మేము మా బిజినెస్ లో కస్టమర్స్ కు అద్భుతమైన క్వాలిటీ అందిస్తున్నాము అలాగే ఇప్పుడు ఓహ్ మూవీని కూడా అంతే క్వాలిటీ తో ప్రేక్షకులకు అందిస్తున్నాము అని అన్నారు.

దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ :
“ఐదు చిత్రాలను నిర్మించిన అనుభవంతో ఒక కొత్త జోనర్ లో, క్రోమో ఫోబియా ని పాయింట్ గా తీసుకొని ఈ చిత్రం రూపొందించాం. కాశ్మీర్ ప్రాంతంలో పూర్తి షూట్ చేసాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని తెలిపారు.

హీరో రఘురామ్ : మాట్లాడుతూ : “ఓహ్” మూవీతో మీ అందరి ముందుకు వస్తున్నాను. సిల్వర్ స్క్రీన్ మీద ఇంతవరకు రానటువంటి అందమైన ప్రేమ కావ్యంతో సాక్షాత్ ఆ పరమశివుడు కొలువై ఉన్న హిమాలయాలు అంతా స్వచ్ఛమైన చిత్రమిది అని అన్నారు.

ప్రముఖ సినీ రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ : “మూవీ టైటిల్ తో పాటు టీజర్ చాలా బాగుంది. కాశ్మీర్ మంచు కొండలలో హీరోయిన్ అందాలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది” అన్నారు.

హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ : యూత్ కి కావలిసిన అన్ని హంగులు, రొమాన్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు తప్పకుండ ఎంజాయ్ చేస్తారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ తూఫాన్,మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ చారి, డి.ఓ.పి లక్కీ ఏకారి, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos